నెంటూర్ గ్రామంలో శ్రీ హర్ష టాలెంట్ స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని హరితహారంలో భాగంగా విద్యార్థులచే మొక్కలు నాటించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.