సంగారెడ్డి జిల్లాలో గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. కొండాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కుళ్లిన కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో భోజనం పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థులు ఉండే గదుల్లో దుర్వాసన, బాత్‌రూమ్‌లు కంపుకొడుతున్నాయని ఆదివారం ఆందోళనకు దిగారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మా పిల్లలను చూడడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.