జాతీయ ఓటర్ దినోత్సవం

880చూసినవారు
జాతీయ ఓటర్ దినోత్సవం
హుజరాబాద్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బుధవారం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ ఏనుగు మైపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఓటు ఒక ఆయుధం లాంటిదని సమ సమాజ నిర్మాణం కోసం యువత ఓటు హక్కును విధిగా వినియోగించుకొని ప్రభుత్వ పాలనలో భాగస్వాములు కావాలని మంచి నాయకులను మన దేశానికి ఇవ్వాలని ఓటు హక్కు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు మేకల నవీన్ కుమార్ మాట్లాడుతూ,భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన హక్కులను అంబేద్కర్ ఆశయాలను తమ మాటల ద్వారా పాటల ద్వారా విద్యార్థులకు ఎంతగానో ఉత్తేజాన్ని అందిస్తూ ఓటు హక్కును ఓటు విలువను వివరిస్తూ వారికి అంబేద్కర్ మరియు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన యోధులు స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థిని విద్యార్థులు ఓటు హక్కు ద్వారా కలిగే లాభాలను ఓటు హక్కు గురించి చక్కగా ఉపన్యాసించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ ఏనుగు మైపాల్ రెడ్డి మరియు తెలుగు అధ్యాపకులు మేకల నవీన్ కుమార్ ,అన్నపురం తిరుపతి, ప్రవీణ్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి,భద్రయ్య మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ట్యాగ్స్ :