హుజురాబాద్: బీజేపీ లో చేరిన జిల్లా మహిళా నాయకురాలు
హుజురాబాద్ పట్టణంలో మంగళవారం బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య పర్యవేక్షణలో మరియు పట్టణ అధ్యక్షులు గంగి శెట్టి రాజు ఆధ్వర్యంలో బీజేపీ మహిళా నాయకురాలు ఈదులకంటి రమాదేవి పార్టీ కండువా కప్పుకొని బీజేపీ పార్టీ లో చేరడం జరిగింది. రమాదేవి మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం నా వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, రాజ శేఖర్, సంపత్, వెంకటేష్, సందీప్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.