అదుపు తప్పిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో మంగళవారం ఆర్మీ వాహనం అదుపుతప్పి 150 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించారు. పలువురు జవాన్లు గాయపడినట్టు తెలుస్తోంది. మెంధార్ లోని బాల్నోయ్ ప్రాంతంలో 18 మంది జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం లోయలోకి దూసుకెళ్లింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.