భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రముఖ వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని ఆదివారం ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పీవీ సింధు తాజాగా తన పెళ్లి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. లవ్ సింబల్ తో తన వివాహానికి సంబంధించిన నాలుగు ఫోటోలను సింధు పోస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్‌లో వీరి వివాహం జరిగింది. నేడు హైదరాబాద్‌లో వీరి రిసెప్షన్ జరగనుంది.