దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. తొలుత స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు క్రమంగా తమ నిధులను మార్కెట్ నుంచి బయటకు తీసుకెళ్లడం, కార్పొరేట్ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 129 పాయింట్లు కుంగి 79,452 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 24,163 వద్ద కొనసాగుతోంది.