చైనాలో ఒక రోడ్డు ప్రమాదంలో కలిసిన ఇద్దరు అపరిచితులు ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. 36 ఏళ్ల లీ అనే వ్యక్తి నడుపుతున్న కారు సదరు యువతి ఈ-బైక్‌ను ఢీకొట్టింది. దాంతో ఆమె కాలర్ భోన్ విరిగిపోయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించిన లీ, ప్రతిరోజూ ఆమెను సందర్శించేవాడు. అతడి బాధ్యతాయుతమైన వ్యవహారశైలికి ముచ్చటపడిన యువతి, మూడు వారాల తర్వాత ఆ వ్యక్తికి ప్రపోజ్ చేసింది.