తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబసమేతంగా హాజరై వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి దర్శనం కల్పించి అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.