

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సంయుక్త మీనన్
సినీ నటి సంయుక్త మీనన్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆమె పాల్గొన్నారు. స్వామివారి సేవలో పాల్గొన్న అనంతరం, ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత మీడియాతో మాట్లాడిన సంయుక్త, తన సినిమా ప్రాజెక్టుల గురించి పలు విషయాలను పంచుకున్నారు.