గుత్తేదారుల సంక్షేమానికి పెద్దపీట: పయ్యావుల
AP: గుత్తేదారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. గుత్తేదారులను గత వైసీపీ ప్రభుత్వం దోపిడీదారులుగా, దోషులుగా చూసిందని ఆరోపించారు. గుత్తేదారులకు బిల్లులు ఇవ్వకపోవడంతో 43 మంది ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పెద్ద గుత్తేదారులకు ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని బట్టి బిల్లులు ఇస్తున్నామన్నారు. చిన్న గుత్తేదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.