గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం
AP: అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక ఈ నెల 25న అదృశ్యమైంది. తల్లిదండ్రులు 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు సాయంత్రం పాడేరులో బాలికను గుర్తించారు. విచారణలో కొర్రా మల్లీశ్వరరావు (22), వంతాల సన్యాసిరావు (24)తో పాటు 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. పోలీసులు నిందితుడిలో ఒకరిని అరెస్ట్ చేశారు.