ఇస్రో పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్‌ను ఇవాళ ప్రయోగించనుంది. నిన్న రాత్రి 8.58 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం నేటి రాత్రి 9.58 గంటలకు రాకెట్ శ్రీహరికోట నుంచి స్వదేశీ సైంటిస్టులు రూపొందించిన స్పాడెక్స్ ఉపగ్రహాలను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లనుంది. కాగా ఈ ఏడాది భారత్‌కు ఇదే ఆఖరి ప్రయోగం.