న్యూఇయర్ విషెస్ చెప్పలేదని ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య (వీడియో)
AP: అనంతపురంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫ్రెండ్ న్యూ ఇయర్ విషెస్ చెప్పలేదని ఇంటర్ సెకండియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పాల్తూరుకు చెందిన చిన్నతిప్పమ్మ (17) ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. ఫస్టియర్ చదివే స్నేహితురాలు తనను కొద్ది రోజులుగా దూరం పెట్టడం, న్యూ ఇయర్ విషెస్ చెప్పలేదని మనస్తాపానికి గురై బుధవారం తెల్లవారుజామున ఉరేసుకొని చనిపోయింది. అయితే కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపించారు.