కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన కారు

67చూసినవారు
కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన కారు
నూతన సంవత్సర వేళ వాహన తనిఖీలు చేస్తుండగా ఇద్దరు కానిస్టేబుళ్లను ఓ కారు ఢి కొట్టింది. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రాజి లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై జి.సతీష్, కానిస్టేబుళ్లతో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారును ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ వీరిని ఢీకొట్టాడు.

సంబంధిత పోస్ట్