ఏపీ ఇంటర్ పరీక్షలపై గందరగోళం.. ప్రజల అభిప్రాయాలు కోరిన ఇంటర్ బోర్డు
బుధవారం ఉదయం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తున్నట్టు ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నం మాట మార్చింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తొలగింపుపై ఏపీ ఇంటర్ బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదని మధ్యాహ్నం మరో ప్రకటన చేసింది. విద్యా సంస్కరణల్లో భాగంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగించాలనేది కేవలం ప్రతిపాదన మాత్రమే అని తెలిపింది. దీనిపై ప్రజల అభిప్రాయాలు, సూచనలను జనవరి 26 లోపు biereforms@gmail.com మెయిల్ చేయాలని ఏపీ ఇంటర్ బోర్డు కోరింది.