బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చాలా కాలం క్రితం నటి తాప్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాప్సీ తన సోదరి కంగనాను కాపీ కొడుతుందంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. 'ఆమె అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. అంతటి టాలెంటెడ్ నటితో నన్ను పోలిస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు' అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.