భవన నిర్మాణాలు, లేఅవుట్లపై కీలక ఉత్తర్వులు
AP: భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు సంబంధించి నిబంధనలను సులభతరం చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనల్లో మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామన్నారు. లేఅవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న 12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదిస్తూ సవరణ చేశామన్నారు. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వేగం పుంజుకోనుందని చెప్పారు.