ఏపీలో మరోసారి కొత్త జిల్లా అంశం తెరపైకి వచ్చింది. గతంలో 13 జిల్లాలు ఉంటే.. ఆ సంఖ్య 26కు పెంచిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల విభజన తర్వాత కూడా కొత్త జిల్లా ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మార్కాపురం పశ్చిమ ప్రాంతంలోని 5 నియోజకవర్గాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.