తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని టీటీడీ కోరింది. అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో 2023 నవంబరులో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ప్రారంభమైన సంగతి తెలిసిందే.