నిఖిల్ కామత్ నిర్వహిస్తోన్న పాడ్‌కాస్ట్‌లో పీఎం మోడీ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ట్రైలర్ వీడియోను నిఖిల్ ట్విట్టర్ ‘ఎక్స్’లో విడుదల చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన పాత ప్రసంగాల గురించి మాట్లాడారు. ‘‘అప్పుడు నేనే ఏదో అని ఉంటాను. పొరపాట్లు జరుగుతుంటాయి. నేనూ మనిషినే.. భగవంతుడిని కాదు కదా..!’’ అని వ్యాఖ్యానించారు. ఈ పాడ్‌కాస్ట్ పూర్తి వీడియో త్వరలోనే విడుదల చేయనున్నారు.