
ఢిల్లీపై గెలుపు.. ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై
IPL2025: ఢిల్లీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 59 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఢిల్లీ ఆలౌటైంది. ఈ పరాజయంతో ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు దూరమైంది. ముంబై బౌలర్లలో బుమ్రా, శాంట్నర్ చెరో 3 వికెట్లతో చెలరేగారు.