కర్ణాటక కోలార్‌లో భారీ ప్రమాదం తప్పింది. బంగారుపేటలోని ఓ మూడంతస్తుల భవనం ఒక్కసారిగాకుప్పకూలింది. గ్రౌండ్ ఫ్లోర్ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా భవనం కూలిపోయింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఓ స్కూల్ గోడ దెబ్బతింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.