నేడు మరాఠా యోధుడు శంభాజీ వర్ధంతి

80చూసినవారు
నేడు మరాఠా యోధుడు శంభాజీ వర్ధంతి
శంభాజీ రాజే భోంస్లే 1657 మే 14న పూణే సమీపంలోని పురందర్ కోటలో జన్మించారు. శివాజీ, సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించిన శంభాజీ.. రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆయన బాల్యం అంతా శివాజీ తల్లి జిజియాబాయి వద్దే గడిచింది. పిలాజీ షిర్కే కుమార్తె యేసుబాయిని శంభాజీ వివాహం చేసుకున్నారు. 1689లో శంభాజీని ఔరంగజేబు బంధించాడు. ఇస్లాం స్వీకరించటానికి తిరస్కరించడంతో మార్చి 11, 1689న శంభాజీ తల నరికి చంపేశారు.

సంబంధిత పోస్ట్