దసాల్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ (వీడియో)
ఏపీలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని దసాల్డ్ సాఫ్ట్ వేర్ సంస్థను ఏపీ మంత్రి నారా లోకేష్ కోరారు. మంగళవారం ఫ్రెంచి సాఫ్ట్ వేర్ సంస్థ దసాల్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వర్జెలాన్తో లోకేష్ భేటీ అయ్యారు. ఏఐ, డీప్ టెక్ రంగాల అభివృద్ధికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలోని విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ని ఏర్పాటు చేయాలని కోరారు.