భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదని సెల్ టవర్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం (వీడియో)
TG: వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలం దామరచేడు గ్రామానికి చెందిన ఆంజనేయులుకు గత కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆంజనేయులు పురుగుల మందు తాగి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అంజనేయులును టవర్‌పై నుంచి కిందికి దించారు. అనంతరం చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.