నటుడు మంచు మనోజ్ హైదరాబాద్ బంజారాహిల్స్ టీఎక్స్ ఆస్పత్రిలో చేరారు. ఆయన కాలికి గాయవడంతో భార్య మౌనిక సాయంతో ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి వైద్యులు మనోజ్‌కు పరీక్షలు నిర్వహించారు. ఆస్తుల విషయంలో మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం వార్తలు వచ్చాయి. అయితే దాడి ఘటనను మంచు కుటుంబ సభ్యులు ఖండించారు.