నేడు తీరం దాటనున్న వాయుగుండం.. భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తెల్లవారుజామున పుదుచ్చేరి, నెల్లూరు మధ్యలో తీరం దాటొచ్చని వాతావారణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని పేర్కొంది. అనంతపురం, చిత్తూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.