ఈ నెలాఖరులోనే వరుసగా రెండు రోజులు సెలవులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 'ఉగాది' పండుగ సందర్భంగా ఆదివారం (ఈనెల 30న) సెలవు ఉండగా.. సోమవారం (ఈనెల 31) రంజాన్ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు హాలిడే ఇవ్వనున్నారు. దీంతో ఆది, సోమవారాల్లో రెండు రోజులు సెలవులను ఎంజాయ్ చేయొచ్చు.