ప్రముఖ నటి, డ్యాన్సర్ సిండ్యానా మృతి

61చూసినవారు
ప్రముఖ నటి, డ్యాన్సర్ సిండ్యానా మృతి
ప్రముఖ హాలీవుడ్ నటి, డాన్సర్, మోడల్ సిండ్యానా శాంటాంజెలో (58) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తాజాగా ఆమె కాస్మొటిక్ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు సమాచారం. దాని వల్లే చనిపోయిందని తెలుస్తోంది. ఇప్పటికీ ఒకేసారి మూడు MTV టాప్ 10 మ్యూజిక్ ఆల్బమ్స్ లో నిలిచిన రికార్డు ఆమెదే కావడం విశేషం. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్