బీహార్లోని నవాడా భూ వివాదంలో 21 ఇళ్లకు నిప్పు.. 10 మంది అరెస్ట్
బీహార్లోని నవాడా జిల్లాలో బుధవారం సాయంత్రం కొందరు వ్యక్తులు 21 ఇళ్లకు నిప్పు పెట్టారు. భూ వివాదమే ఘటనకు కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. పది మందిని అదుపులోకి తీసుకుని, ఇతర నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఇళ్లు తగలబడుతున్నప్పుడు గాలిలోకి కాల్పులు కూడా జరిగాయని పోలీసులు తెలిపారు.