ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో జిల్లా ఇన్ చార్జి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో వారు కీ రోల్ పోషించేలా హౌజింగ్ శాఖ ప్రొవిజినల్ రూల్స్ లో నిబంధనలు పొందుపర్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన నిబంధనలపై త్వరలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు రివ్యూ చేయనున్నట్లు సమాచారం. మంత్రుల సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత ఫైనల్ చేయనున్నట్లు తెలిసింది.