ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పురోగతిలో తెలంగాణ వేగంగా పరుగులు తీస్తోంటే, ఏపీ మందగమనంతో సాగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది. జాతీయ సగటు (100%) తో పోలిస్తే 2023-24లో తెలంగాణ తలసరి ఆదాయం 193.6%గా ఉండగా, ఏపీ తలసరి ఆదాయం 131.6%గా ఉంది. జాతీయ స్థూల ఉత్పత్తిలో 2010-11లో ఆంద్రప్రదేశ్ వాటా 4.6%, తెలంగాణ వాటా 3.8% ఉండగా, 20023-24 నాటికి ఏపీ వాటా 4.7% తెలంగాణ వాటా 4.9% కి చేరాయి.