
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు
AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. శనివారం ఏపీ సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదన్నారు. వరద జలాలను మాత్రమే తరలిస్తామన్నారు. తెలంగాణలో గోదావరిపై కాళేశ్వరం నిర్మిస్తే తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.