AP: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి (VSR) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. శనివారం ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వాళ్ల పార్టీ వాళ్లు పారిపోతున్నారంటే దానికి మన దగ్గర సమాధానం లేదు. నమ్మకం ఉంటే పార్టీలో ఉంటారు. లేకపోతే వాళ్ల దారి వాళ్లు చూసుకుంటారు. అది వైసీపీ వ్యక్తిగత విషయం. దానిపై ఎలాంటి కామెంట్స్ చేయను.’ అని చంద్రబాబు అన్నారు.