మనం జాబ్ అడగడం కాదు.. ఇచ్చే స్థితిలో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే.. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ ఎంతో అభివృద్ధి చెందిందని సీఎం చెప్పారు. శనివారం అమరావతి సచివాలయంలో సీఎం మాట్లాడారు. "MSMEలు సృష్టిస్తే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెప్పించాను." అని చంద్రబాబు అన్నారు.