
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలనే నిర్ణయానికి ట్రంప్, పుతిన్ అంగీకారం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని డోనాల్డ్ ట్రంప్, పుతిన్ అంగీకారం తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇరువురు నేతలు మాట్లాడుకున్న తర్వాత.. శాశ్వత శాంతితో యుద్ధానికి ముగింపు పలకాలనే నిర్ణయానికి వచ్చారు.అమెరికా, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలని ఇరువురు నేతలు చర్చించారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటన చేసింది.