AP: బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు కలిసిపోయి, సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నాయి. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం అల్లూరి, ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.