స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆదివారంతో పోలిస్తే.. సోమవారం కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 71,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 77,450 గా కొనసాగుతుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 100 తగ్గి.. రూ.98,900 కి చేరింది. కాగా, ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో అమల్లో ఉంటాయి.