BIG BREAKING: రతన్ టాటా కన్నుమూత
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) ఇకలేరు. అనారోగ్య సమస్యలతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని టాటా గ్రూప్స్ ధృవీకరించింది. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా 1937 డిసెంబర్ 28న నావల్ టాటా-సోనీ టాటా దంపతులకు ముంబైలో జన్మించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా ఉన్నారు.