

అచ్యుతాపురం-అనకాపల్లి నాలుగు వరుసల రోడ్డుకి శంకుస్థాపన
అచ్యుతాపురం-అనకాపల్లి మధ్య నిర్మించనున్న నాలుగు వరుసల రహదారికి సోమవారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అచ్యుతాపురం కూడలిలో ఫ్లైఓవర్ పనులను భూమి పూజ చేశారు. మొత్తం రూ.243 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ నాలుగు వరసల రోడ్డు వలన ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని మంత్రి తెలిపారు.