'ముందు మీ సొంత రికార్డును చూసుకోండి'.. ఇరాన్ నేత ఖమేనీకి భారత్ హితవు
గాజా, మయన్మార్, భారత్‌ని లోని ముస్లింలకు ఇబ్బందులు తప్పడం లేదని, వారు బాధపడుతున్నారని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. భారత్‌లోని మైనారిటీల పరిస్థితులపై ఇరాన్ సుప్రీం లీడర్ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. "ఇవి పూర్తిగా తప్పుడు సమాచారంతో ఉన్నాయి. మైనార్టీలపై మాట్లాడే దేశాలు ఇతరులపై ఏవైనా వ్యాఖ్యలు చేయడానికి ముందు వారి సొంత రికార్డును పరిశీలించుకోవాలి," అని భారత్ సూచించింది.