VIDEO: హరీశ్ రావు భుజానికి గాయం
సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద అరెస్ట్ చేసిన BRS నేత హరీశ్ రావును పోలీసులు కేశంపేట PSకు తరలించారు. విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. హరీశ్ ను పోలీస్ బస్సు నుంచి స్టేషన్ లోకి తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. ఈక్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో హరీశ్ రావు భుజానికి గాయమైంది. ఆయన భుజాన్ని పట్టుకొని తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.