భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణ సమస్యలు వస్తాయని తెలిపిన నిపుణులు

81చూసినవారు
భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణ సమస్యలు వస్తాయని తెలిపిన నిపుణులు
తిన్న వెంటనే స్నానం చేసే అలవాటు ఉంటే మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ రక్త ప్రసరణ అవసరం. "ఆయుర్వేదం ప్రకారం, స్నానం చేశాక శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే తక్కువ రక్త ప్రసరణ జరుగుతుంది. దీంతో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది వివిధ వ్యాధులకు దారి తీస్తుంది" అని డాక్టర్ రేఖా రాధామోని తెలిపారు. భోజనానికి 3 గంటల ముందు స్నానం చేయడం ఉత్తమమని చెప్పారు.

సంబంధిత పోస్ట్