సజ్జలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
AP: వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విజ్ఞప్తులు ఏమైనా ఉంటే హైకోర్టు ముందే చెప్పుకోవాలని తేల్చి చెప్పింది. కాగా, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది.