AP: ఫెంగల్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. సోమవారం అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.