రాజేంద్రప్రసాద్ను పరామర్శించిన హీరో నాగార్జున (వీడియో)
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ను హీరో నాగార్జున పరామర్శించారు. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కూకట్పల్లిలోని ఇందు విల్లాస్లో రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లిన నాగార్జున గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కూతురు మృతితో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన రాజేంద్రప్రసాద్ను, ఆయన కుటుంబసభ్యులను నాగార్జున పరామర్శించి ఓదార్చారు.