వైజాగ్ హనీట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్

64చూసినవారు
వైజాగ్ హనీట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్
వైజాగ్ హనీట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై లైంగిక దాడి జరిందని ఈ ఏడాది జనవరిలో పీఎంపాళెం పోలీస్ స్టేషన్‌లో జాయ్ జమీమా ఫిర్యాదు చేసింది. ఐటీ హిల్స్ సమీపంలోని బీన్ బోర్డు కాఫీ షాప్ యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండానే దర్యాప్తు చేశారు. విషయం తెలిసి జాయ్ జమీమా కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని పోలీసులను బెదిరించింది. సోమవారం ఆమెను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

సంబంధిత పోస్ట్