సెల్ఫీ వీడియో తీసుకుని.. 104 ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
సెల్ఫీ వీడియో తీసుకుని 104 ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. హిందూపురం 104 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ వేధింపులకు గురి చేస్తున్నాడని, తన చావుకు రామకృష్ణనే కారణమని 104 సోమందేపల్లి డేటా ఎంట్రీ ఆపరేటర్ రామిరెడ్డి చెప్పుకొచ్చాడు. ఈ వీడియోని కుటుంబ సభ్యులకు పంపగా.. వారు ఉన్నతాధికారులు ఫిర్యాదులు చేశారు. దాంతో ఫోన్ చేసి.. రామిరెడ్డిని ఇంటికి తరలించారు.