AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధనకు సంబంధించి ఏప్రిల్ నెల కోటాను టీటీడీ శనివారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం జనవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ టికెట్లు పొందిన భక్తులు జనవరి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది.